SV Zoo Wallaby Death : తిరుపతి శ్రీ వెంకటేశ్వర జూలో (SV Zoo) అరుదైన వాలబీ మరణించింది. పదేళ్లుగా జూలో ఉంటున్న ఈ జంతువు అనారోగ్యం కారణంగా మరణించటం ప్రతీ ఒక్కరినీ తీవ్రంగా కలిచివేసింది.
గుజరాత్ రాధే కృష్ణ టెంపుల్ ఎలిఫెంట్ వెల్ఫేర్ ట్రస్ట్ 2025 ఆగస్టు 27న విరాళంగా వాలబీను ఎస్వీ జూకు అందించారు. ఈ జంతువు, రెండు రోజులుగా అనారోగ్యంతో బాధపడి అర్థరాత్రి ప్రాణాలు కోల్పోయింది. జూ అధికారులు ఇంటెన్సివ్ కేర్ ఇచ్చి, పశువైద్యుల సహాయంతో చికిత్స చేశారు. కానీ పరిస్థితి మెరుగుపడలేదు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయింది.
వాలబీ పోస్ట్‌మార్టం పరీక్షలో టాక్సోప్లాస్మోసిస్ (పారాసైట్ ఇన్ఫెక్షన్) కారణంగా మరణించిందని తేలింది. ఈ జంతువు సంజీవని బ్లాక్‌లో క్వారంటైన్‌లో ఉంచబడింది. మరణం తర్వాత, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం పాథాలజీ విభాగంలో పోస్ట్‌మార్టం చేసి, SV జూలోని పోస్ట్‌మార్టం కాంప్లెక్స్‌లో ఖననం చేశారు. జూలో అధికారులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ఈ జంతువు పదేళ్లుగా మాతోనే ఉంది. ఈ మరణం మాకు బాధాకరం. జంతువుల ఆరోగ్యానికి మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం” అని తెలిపారు.
వాలబీలు ఆస్ట్రేలియా మూల జంతువులు, SV జూలో అరుదైనవి. గుజరాత్ ట్రస్ట్ విరాళంగా ఇచ్చిన జంతువులు. 2 మీర్‌కాట్‌లు, 2 కామన్ మార్మోసెట్‌లు, 2 ఎర్ర మెడ వాలబీలు జూకు ప్రత్యేక ఆకర్షణ. ఇవి నిత్యం క్వారంటైన్‌లో ఉంటాయి. ఇక ఇప్పుడు వాలబీ మరణానికి కారణమైన టాక్సోప్లాస్మోసిస్ ఒక పారాసైట్ ఇన్ఫెక్షన్. ఇది జంతువులు, మనుషులకు వ్యాప్తి చెందుతుంది.


