Friday, September 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Swimming pool: సామాన్యుడికి అందుబాటులో లేని స్విమ్మింగ్ పూల్స్

Swimming pool: సామాన్యుడికి అందుబాటులో లేని స్విమ్మింగ్ పూల్స్

ఈత నేర్చుకోవడానికి గ్రామ, పట్టణ ప్రాంత పిల్లలు,పెద్దలు ఆయా శివారులోని పంట బావులు లేదా చెరువులు, కాలువలకు వెళ్లి మునగ మొద్దులు,లేదా టైర్ ట్యూబ్ బెలూన్ లును నడుముకు కట్టుకొని ఈతను చిన్నారులు నేర్చుకునేవారు. ప్రస్తుతం మారుతున్న కాలంతో పాటు వేసవి కాలంలో బావులు, పంట కాలువలు గ్రామీణ పట్టణ పరిసరాలలో కనుమరుగు అయ్యాయి. దీనికి తోడు భూగర్భ జలాలు అడుగంటిపోయి బావులు, చెరువులు, కాలువలు ఎండిపోయాయి. దీంతో దూర ప్రాంతాల బావులకు వెళ్లేందుకు యువత ఆసక్తి చూపడం లేదు. ఇదే అదునుగా భావించిన కొంతమంది అక్రమార్కులు ప్రభుత్వ నిభందనలు అతిక్రమించి అనుమతులు లేకుండా ఈత కొలను ఏర్పాటు చేస్తున్నారు. మున్సిపల్, పంచాయితీ అనుమతులు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఆసక్తి ఉన్న వారి వద్ద నుండి భారీ మొత్తంలో ముక్కు పిండి అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. వేసవికాలంలో కాస్తంత సేద తీరేందుకు లేదా తమ చిన్నారులకు ఈతకొలనులో ఈత నేర్పించుకుందామంటే ఒక్కొక్క వ్యక్తి నుండి రూ. 70 నుండి 100 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అలాగే తమ ఈత కొలనులోనే ట్యూబులను కొనాలని, ఈతకు సంబంధించిన కళ్లద్దాలు, టోపీలు, నిక్కర్లు కొనాలంటూ అధిక ధరలతో ఆ సామాగ్రిని విక్రయిస్తూ సగటు సామాన్యుడిని నిలువు దోపిడీ చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించిన వారి పట్ల దురుసుగా, దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు.

- Advertisement -

ఎమ్మిగనూరు పట్టణంలో ఆదోని బైపాస్ రోడ్ లో ఓ స్విమ్మింగ్ పూల్, అలాగే మైనార్టీ కాలని సమీపంలో మరొక స్విమ్మింగ్ ఫుల్ వెలిశాయి. మహిళలు, పురుషులకు వేరు వేరుగా స్నానపు గదులు, మరుగుదొడ్లు, విశ్రాంతి రూమ్స్ వుండాలి. కానీ అవేవీ లేవు.దీనికి తోడు ప్రతి సంవత్సరం నిర్వాహకులు వాటి ధరను పెంచుతూ వస్తున్నారు. దీంతో ఇంట్లో మారం చేస్తున్న చిన్నారులను ఈత కొలనులకు తీసుకెళ్లి తమ జేబులు ఖాళీ చేసుకుంటున్నారు. అలాగే ఈత కొలనులో కేర్ టేకర్, అనుభవం ఉన్న ఈతగాళ్లు లేకపోవడంతో చిన్నారులు ప్రమాదాల భారిన పడే అవకాశం ఉంది. ఇష్టానుసారంగా నీళ్ళల్లో దూకడం లేదా లోతైన ప్రదేశానికి వెళ్ళిన ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఏదేమైనా ఈత కొలను ధరలను అదుపుచేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, కేర్ టేకర్, ఈత నేర్పడానికి శిక్షణ పొందిన ఈతగాళ్లు, మహిళలు, పురుషులకు వేరు వేరుగా డ్రెస్ ఛేంజిగ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి. స్విమ్మింగ్ పూల్స్ ను తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తే సామాన్య కుటుంబాలు వీటి సేవలను పొందగలరు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News