TDP Activists| టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు కార్యకర్తలను గుర్తించారు. పార్టీ కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వారికీ సముచిత ప్రాధాన్యం కల్పించారు. తాజాగా విడుదలచేసిన నామినేటెడ్ పోస్టుల రెండో జాబితాలో పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు, నేతలకు చోటు కల్పించారు. ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు మాచర్లలో జరిగిన హింస దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఆ హింసా ఘటనల్లో టీడీపీ మహిళా కార్యకర్త చేసిన పోరాటం అందరి దృష్టిని ఆకర్షించింది. మాచర్ల నియోజకవర్గం రెంటచింత్ర గ్రామంలోని ఓ పోలింగ్ బూత్‌లో మంజులారెడ్డి టీడీపీ ఏజెంట్‌గా కూర్చున్నారు.
అయితే మంజులపై వైసీపీ కార్యకర్తలు గొడ్డలితో దాడిచేశారు. ఈ దాడిలో ఆమె తలకు తీవ్ర గాయమైంది. అయినా కానీ ఎలాంటి బెదురు, భయం లేకుండా మళ్లీ పోలింగ్ బూత్‌కు వెళ్లి ఏజెంట్‌గా కూర్చుకున్నారు. ఆమె చూపించిన తెగువ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆమె చూపించిన తెగువకు ప్రతిఫలం దక్కింది. పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆమెకు కీలక పదవి కట్టబెట్టారు. ఏపీ శిల్పారామం ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని ఆమెకు ఇచ్చారు. ఆమెకు పదవి ఇవ్వడంపై సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే గతేడాది చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో ఏపీ టీడీపీ ప్రొఫెషనల్స్ ఫోరం అధ్యక్షురాలిగా ఉన్న తేజస్వి పొడపాటికి కూడా కల్చరల్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ తప్పులను ధీటుగా ప్రశ్నించిన పట్టాభి, ఆనం వెంటకరమణా రెడ్డి, జీవీ రెడ్డికి కూడా కీలక పదవులు ఇచ్చారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మిషన్ చైర్మన్‌గా పట్టాభిరామ్), ఏపీ స్టేట్ ఫైబర్‌నెట్ చైర్మన్‌గా జీవీ రెడ్డి, ఆక్వా డెవలప్‌మెంట్ చైర్మన్‌గా ఆనంను నియమించారు. దీంతో పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు, నేతలను చంద్రబాబు, మంత్రి లోకేష్ గుర్తించి పదవులు కట్టబెట్టారని టీడీపీ క్యాడర్ హర్షం వ్యక్తం చేస్తోంది.