Saturday, December 28, 2024
Homeఆంధ్రప్రదేశ్TDP: విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశారు.. టీడీపీ కౌంటర్

TDP: విద్యుత్ రంగాన్ని జగన్ నాశనం చేశారు.. టీడీపీ కౌంటర్

విద్యుత్ ఛార్జీల పెంపుపై వైసీపీ ఆందోళనలపై అధికార తెలుగుదేశం పార్టీ(TDP) కౌంటర్ ఇచ్చింది. ఈమేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. గత ఐదేళ్ల అరాచక పాలనలో విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిన మాజీ సీఎం జగన్.. కూటమి ప్రభత్వం ఏర్పాటైన ఆరు నెలల్లోనే విద్యుత్ రంగం కోసం ధర్నాకు పిలుపునివ్వడంపై జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేసింది.

- Advertisement -

గత వైసీపీ(YCP) ఐదేళ్ల పాలనలో అక్రమ విద్యుత్ కొనుగొళ్లు, కక్ష సాధింపుతో పీఏఏల రద్దు, ఏపీ జెన్‌ కోలో విద్యుదుత్పత్తి తగ్గుదల, కరెంటు కోతలు, ట్రాన్స్ ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లలో అవినీతి, బొగ్గు కొనుగోళ్లలో అవినీతి, ట్రూ అప్ చార్జీలు అంటూ కొత్త రకం బాదుడు.. ఇలా 9 సార్లు ఛార్జీలు పెంచిన మీరు ఎలా ధర్నాలు చేస్తారని ప్రశ్నించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News