Btech Ravi about Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్ కుటుంబంపై మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బీటెక్ రవి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మాకు తెలిసిన జగన్ వేరు.. బయటకు తెలిసిన జగన్ వేరు” అంటూ దుయ్యబట్టారు. ఆదివారం మంగళగిరిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
Also Read: https://teluguprabha.net/national-news/suicide-attack-on-zafar-express/
1968లో పులివెందుల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ రాజారెడ్డి సతీమణి జయమ్మ వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయారని బీటెక్ రవి అన్నారు. ఆనాడే వైఎస్ కుటుంబంలో ఓటమి చరిత్ర మొదలైందని గుర్తుచేశారు. 1962లోనే పులివెందుల పోలీస్ స్టేషన్‌లో వైఎస్ రాజారెడ్డి పేరుపై రౌడీషీట్ ఉందని ఆరోపించారు. తమను నమ్మిన వ్యక్తులను, వ్యాపార భాగస్వాములను దారుణంగా హతమార్చి, మంగంపేట బైరైటీస్ సంపాదనతోనే వీరు రాజకీయాల్లోకి వచ్చారని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-reddy-decision-on-maize-procurement/
‘జగన్ ప్రోద్బలం, సహకారం వల్లే మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగింది. పులివెందుల ప్రజలకు మాత్రమే తెలిసిన జగన్ అసలు క్రూరమైన స్వభావం ఇప్పుడు రాష్ట్ర ప్రజలందరికీ తెలియాలి. తనకు అడ్డువస్తే ఎవరినైనా తొలగించే చరిత్ర వారిది. జగన్ కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాత్రమే తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణంపై “అనుమానాస్పద మృతి” అనే కోణాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారు.- అని బీటెక్ రవి వ్యాఖ్యానించారు.

