మడకశిర (తెలుగు ప్రభ): రాష్ట్రంలో పింఛను పంపిణీ కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం అక్కంపల్లిలో పింఛను పంపిణీ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్న టీడీపీ నాయకులు.. లబ్ధిదారుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అక్కంపల్లి గ్రామంలో శనివారం నిర్వహించిన సామాజిక భద్రత పింఛన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మడకశిర నియోజకవర్గ పరిశీలకులు సుధాకర్, రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీనివాసమూర్తి, రాష్ట్ర ఒక్కలిగా కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీనారాయణ, మాజీ మున్సిపల్ ఛైర్మన్ నరసింహరాజు, పట్టణ అధ్యక్షుడు నాగరాజు, ప్రధాన కార్యదర్శి తిమ్మరాజు, క్లస్టర్ ఇన్‌చార్జ్ రవికుమార్, మాజీ కౌన్సిలర్ బలరాం, ఉమాశంకర్, పుల్లయ్య చౌదరి, బూత్ ఇన్‌చార్జ్ సోమశేఖర్ రెడ్డి, చెరువు సంఘం అధ్యక్షుడు హనుమంతు, టీడీపీ నాయకులు అక్కంపల్లి బాబు, రమేష్, రవి, మంజు, డీలర్ చంద్ర, గ్రామ ప్రజలు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

