వైసీపీ ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి ఆర్కే రోజా(Roja)పై టీడీపీ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్(Bhanu Prakash) సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మహిళలు ఏర్పాటు చేసిన ఫోటో ఆర్ట్ గ్యాలరీని ప్రారంభించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రోజాను తీవ్రంగా విమర్శించారు. రోజా ఓ పిచ్చిదని.. ఆమెకు పిచ్చి కూతలు తప్ప మరొకటి రావని ఘాటు విమర్శలు చేశారు. ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదన్నారు.
- Advertisement -
రోజాకు గంగిరెద్దు, ఆవుకు మధ్య తేడా తెలియదని ఎద్దేవా చేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని దావోస్ వెళ్తే దానిపై కూడా రాద్ధాతం చేస్తున్నారని మండిపడ్డారు. పెళ్లిళ్లు, పేరంటాలు, ఓట్ల కోసం దావోస్ వెళ్లలేదని.. రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సమిష్టిగా కృషి చేస్తుందన్నారు.