దేశవ్యాప్తంగా హోలీ(Holi Celebrations) వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగులను చల్లుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఈ హోలీ వేడుకల్లో ఒకరిపై ఒకరు రంగులు చల్లుకోవడమే కాదు చిందులు వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు రాజకీయాల్లో బిజీబిజీగా గడిపే ప్రజాప్రతినిధులు హోలీ వేడుకల్లో డ్యాన్స్ వేస్తూ సేద తీరుతున్నారు.
తెలంగాణలో కేంద్ర మంత్రి బండి సంజయ్, మాజీ మంత్రి మల్లారెడ్డి హోలీ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఇక మల్లారెడ్డి అయితే మాస్ డ్యాన్స్ వేసి అదరగొట్టారు. ఏపీలోనూ టీడీపీ ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి(JC Ashmit Reddy) డ్యాన్స్ ఇరగదీశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో జరిగిన హోలీ సంబరాల్లో అస్మిత్ రెడ్డి ‘జై బాలయ్య’ పాటకు స్టెప్పులేసి అందరిలో ఫుల్ జోష్ నింపారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.