Saturday, June 14, 2025
HomeAP జిల్లా వార్తలుఅమరావతిTDP Politburo: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ.. కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్..!

TDP Politburo: నేడు టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ.. కీలక మార్పులు చోటు చేసుకునే ఛాన్స్..!

శుక్రవారం సాయంత్రం టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ కానుంది. ఇవాళ సాయంత్రం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. ఈ భేటీలో తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పాత తరం నేతలను పక్కన పెట్టి యువతకు పెద్దపీట వేస్తారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దీంతో ఇదే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

- Advertisement -

ఇటీవల పార్టీ పదవుల విషయంలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలతో టీడీపీ పొలిట్‌బ్యూరోకు ప్రాధాన్యత ఏర్పడింది. మూడు సార్లకు మించి పార్టీ పదవులు ఉండకూడదని.. లోకేష్ అన్నారు. అయితే అది తన వ్యక్తిగత అభిప్రాయమని.. తాను అదే చేస్తానని తెలిపారు. గ్రామ స్థాయి నుంచి పొలిట్‌బ్యూరో వరకు మార్పులు ఉండాలనికూడా ఆయన పేర్కొన్నారు. దీంతో లోకేష్ టీమ్‌ రెడీ అవుతుందనే చర్చ మొదలయ్యింది.

ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే సమావేశంలో ఈ మేరకు చర్యలు తీసుకుంటారా.. పొలిట్‌బ్యూరోలో మార్పులు ప్రస్తావిస్తారా..? అనేది చర్చనీయాంశంగా మారింది. 2024 ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి ప్రభుత్వం.. గతంలో మంత్రులుగా పనిచేసినవారిని, సీనియర్‌ నేతలను సైతం పక్కనబెట్టింది. యువ నాయకులకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రాధాన్యత ఇచ్చారు. అయితే, పార్టీ పదవులుల్లో కొందరు సీనియర్‌ నేతలు ఉన్నారు.. లోకేష్‌ వ్యాఖ్యలతో ఆ సీనియర్లకు కూడా రెస్ట్‌ ఇవ్వనున్నారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ భేటీలో ఏ విషయాలు చర్చకు వస్తాయో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News