Ashok Gajapathi Raju: రాష్ట్రపతి ద్రౌపదిముర్ము కొత్తగా మూడు రాష్ట్రాలకు గవర్నర్లను నియమించారు. గోవా గవర్నర్‌గా టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు నియమితులయ్యారు. అలాగే హర్యానా గవర్నర్‌గా ప్రొఫెసర్ అషిమ్‌కుమార్ ఘోష్, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా కవీందర్ గుప్తాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
- Advertisement -
కాగా అశోక్ గజపతిరాజు విజయనగరం రాజుల కుటుంబానికి చెందిన వారు. తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. ఎమ్మెల్యే, ఎంపీగా విధులు నిర్వర్తించారు. కేంద్ర పౌర, విమానయానశాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్నారు. వివాదరహితుడిగా పేరు ఉన్న ఆయనను కేంద్రం గోవా గవర్నర్‌గా నియమించడంపై టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


