Thursday, February 6, 2025
Homeఆంధ్రప్రదేశ్TDP: జగన్ ఇంటి ముందు అగ్నిప్రమాదం.. టీడీపీ సంచలన ట్వీట్

TDP: జగన్ ఇంటి ముందు అగ్నిప్రమాదం.. టీడీపీ సంచలన ట్వీట్

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్(Jagan) నివసిస్తున్న తాడేపల్లిలోని ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఆ నివాసం ముందు గార్డెన్‌లో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో కొన్ని పత్రాలు, డైరీలు తగలబడ్డాయి. దీనిపై వైసీపీ(YCP) స్పందిస్తూ.. కూటమి ప్రభుత్వంలో జగన్ భద్రతపై అనుమానాలు తలెత్తుతున్నాయని తెలిపింది. తాజాగా ఈ ప్రమాదంపై అధికార తెలుగుదేశం(TDP) పార్టీ ఎక్స్ వేదికగా స్పందించింది. లిక్కర్ స్కాంలో సిట్ పడగానే తాడేపల్లి ప్యాలెస్ బయట కాగితాలు తగలబడ్డాయని ఆరోపించింది. ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదని స్పష్టం చేసింది.

- Advertisement -

“సిట్టు పడింది – తగలబడింది. ఉదయం లిక్కర్ స్కాంలో సిట్ పడింది. రాత్రికి తాడేపల్లి ప్యాలెస్ బయట తగలబడింది. ప్యాలెస్ బయట తగలబడిన కాగితాలు, డైరీలు ఏంటి ? సిట్ తన ఇంటి దాకా వస్తుందని, ముందే లిక్కర్ స్కాంకి సంబంధించి తాను రాసుకున్న లెక్కలు, డాక్యుమెంట్లు తగల బెట్టారా ? నిన్న సాయంత్రం జరిగితే, ఇప్పటి వరకు తన ఇంటి ముందు ఉన్న సిసి ఫుటేజ్ ఎందుకు బయట పెట్టలేదు ? తానే తగలబెట్టి, ప్రభుత్వం మీద తోసేయటమే, 2..0 నా ? ఎన్ని కుట్రలు చేసినా వదిలేది లేదు. సిట్ వస్తుంది, విచారణ చేస్తుంది, నీ అవినీతిని బయటకు తీస్తుంది.. గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టు తాడేపల్లి ఫైల్స్” అని ట్వీట్ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News