Monday, June 16, 2025
Homeఆంధ్రప్రదేశ్Helicopter: సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య.. డీజీపీ విచారణ

Helicopter: సీఎం చంద్రబాబు హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్య.. డీజీపీ విచారణ

CM Chandrababu Helicopter issue: ఏపీ సీఎం చంద్రబాబు జిల్లాల పర్యటనకు తరచుగా వాడే హెలికాప్టర్లో సాంకేతిక సమస్య రావడంపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇంటెలిజెన్స్ చీఫ్ కు డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. ఈ ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి, ఇతర వీవీఐపీలు ఉపయోగించే హెలికాప్టర్ల భద్రత, సాంకేతిక అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

కాగా జీఎంఆర్ సంస్థకు చెందిన హెలికాఫ్టర్ ను చంద్రబాబు జిల్లాల పర్యటనకు వెళ్లినప్పుడు వాడుతున్నారు. అయితే ఇటీవల తరుచుగా ఆ హెలికాఫ్టర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అధికార వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. టెక్నిలక్ ప్రాబ్లమ్ ఎందుకు తలెత్తుతున్న దానిపై విచారణ జరుపుతున్నారు. నివేదిక వచ్చిన అంతరం అందుకు తగ్గ చర్యలు తీసుకోనున్నారు.

ఇదిలా ఉంటే ఈ సమస్య కారణంగా ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు ఆయన సీఎం చంద్రబాబు వాడే హెలికాప్టర్ ఎక్కారు. అయితే ఎక్కిన తర్వాత సాంకేతిక సమస్య ఉన్నట్లు తేలడంతో పర్యటనను రద్దు చేసుకున్నారు. మరో హెలికాఫ్టర్ అందుబాటులో లేకపోవడంతో పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకుని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిపోయారు.

మరోవైపు సెర్ప్ కార్యక్రమం 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంపై చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. సరిగ్గా 25 సంవత్సరాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు అనే ఒక మారుమూల ప్రాంతంలో వెలుగు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించానని గుర్తు చేసుకున్నారు. గ్రామీణ ప్రాంత మహిళల భాగస్వామ్యంతో గ్రామాల ఆర్థికాభివృద్ధిని సాధించడమే ఆనాటి ప్రాజెక్టు లక్ష్యమని తెలిపారు. అది కాలక్రమంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (SERP)గా రూపాంతరం చెందిందని పేర్కొన్నారు. అప్పటి నుండి లక్షలాది గ్రామీణ మహిళల జీవితాలలో, వేలాది గ్రామాలలో నిరంతరం అభివృద్ధి వెలుగులు నింపుతూ గ్రామీణ పేదరిక నిర్మూలనకు సెర్ప్ నిరంతరం కృషి చేస్తోందన్నారు. సెర్ప్ కార్యకలాపాలలో భాగస్వాములవుతూ… నవసమాజ నిర్మాతలై గ్రామీణ పేదరిక నిర్మూలనను ఒక ఉద్యమంలా ముందుకు తీసుకువెళ్తున్న గ్రామీణ మహిళలకు… వారిని ప్రగతి పథంలో నడిపిస్తున్న సెర్ప్ ఉద్యోగులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు.

- Advertisement -

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News