Homeఆంధ్రప్రదేశ్America: అమెరికాలో విషాదం.. ఉద్యోగం కోల్పోయి గుండెపోటుతో తెలుగు యువకుడు మృతి

America: అమెరికాలో విషాదం.. ఉద్యోగం కోల్పోయి గుండెపోటుతో తెలుగు యువకుడు మృతి

Telugu boy Heart attack in America: అగ్రరాజ్యం అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. నెల రోజుల్లో పెళ్లి పీఠలెక్కబోతున్న ఓ తెలుగు యువకుడు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోయాడు. వెర్మాంట్‌ రాష్ట్రంలోని బర్లింగ్‌టన్‌లో నివాసముంటున్న జి.నితిన్‌ రెడ్డి (27) అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించాడు. వచ్చే నెలలోనే నితిన్‌ రెడ్డి వివాహం జరగనుండగా.. అతడి వివాహానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్న తరుణంలో ఈ విషాదం చోటుచేసుకోవడం ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కాగా, ఇటీవలే ఉద్యోగం కోల్పోవడం, వివాహ సమయం దగ్గర పడుతుండడంతో నితిన్‌ తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. నితిన్‌ స్వస్థలం ఏలూరు కాగా.. అతడి తల్లిదండ్రులు ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Also read: CM Revanth Reddy: తుమ్మిడిహట్టిపై చర్చించేందుకు సిద్ధం.. డేట్ ఫిక్స్ చేయండి.. ఫడ్నవిస్‌కు సీఎం లేఖ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News