Road Accident: అమెరికా(America)లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలుగు యువతి మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వ్యాపారి గణేష్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) ఎంఎస్ చదివేందుకు రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో ఉంటూ చదువుకుంటున్నారు.
అయితే శుక్రవారం రాత్రి యువతి ప్రయాణిస్తున్న కారును వేగంగా ట్రక్ ఢీ కొట్టడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. తమ కుమార్తె మృతదేహాన్ని త్వరగా స్వగ్రామం తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను వేడుకుంటున్నారు. మరోవైపు పరిమళ మృతదేహాన్ని వీలైనంత త్వరగా తెనాలి పంపించేందుకు తానా ప్రతినిధులు ఏర్పాట్లు చేస్తున్నారు.