మహా శివరాత్రి (Maha Shivratri) పర్వదినం సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu) శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. “పవిత్రమైన మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు. నదీ స్నానాలు, ఉపవాసం, జాగరణ దీక్షలను అత్యంత నిష్ఠతో ఆచరిస్తున్న భక్తులకు ఆ శంకరుడు సకల శుభాలను, ఆనంద ఆరోగ్యాలను అనుగ్రహించాలని కోరుకుంటున్నా” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కూడా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఆ మహదేవుడి అనుగ్రహం అందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు తెల్లవారుజామున నుంచే భక్తులతో కిటకిటలాడుతున్నాయి. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా నిర్వహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. శివనామస్మరణతో శైవక్షేత్రాలు మార్మోగుతున్నాయి. ప్రముఖ శైవక్షేత్రాల్లో అయితే మహా శివరాత్రి వేడుకలు వైభవోపేతంగా కొనసాగుతున్నాయి.