Friday, November 8, 2024
Homeఆంధ్రప్రదేశ్Deepavali Wishes: దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

Deepavali Wishes: దీపావళి శుభాకాంక్షలు చెప్పిన తెలుగు రాష్ట్రాల ప్రముఖులు

Deepavali Wishes| దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. చీకట్లను పారదోలుతూ కొత్త వెలుగులను తమ జీవితాల్లోకి ప్రజలు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల రాజకీయ ప్రముఖులు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్(Pawankalyan).. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanthreddy) ప్రజలకు దీవాళి శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -

“నరకాసుర వధ తర్వాత ఇంటింటా దీపాలు వెలిగించుకొని సంతోషంగా నిర్వహించుకొనే వెలుగుల పండుగ దీపావళి. ఒక దీపాన్ని వెలిగించడం ద్వారా మన చుట్టూ ఉన్న చీకట్లను పారద్రోలినట్లుగా.. సూపర్-6 హామీల్లో భాగంగా ‘దీపం 2.0’ పథకంతో ఈ దీపావళి పండుగను మరింత కాంతివంతం చేస్తున్నాం. తెలుగింటి ఆడబిడ్డల కళ్లల్లో ఆనందం చూసేందుకు ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అర్హులైన మహిళలు ఇప్పటికే ఈ పథకానికి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇది ఎంతో సంతోషించదగిన విషయం. వారి నుంచి వస్తున్న స్పందనతో మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేసేలా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ ఆనంద దీపావళి.. రాష్ట్ర ప్రజల జీవితంలో కొత్త వెలుగులు నింపాలి” అని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాంక్షించారు.

“చీకట్లను ఛేదిస్తూ..మార్పును ఆశిస్తూ… వెలిగిన దీపం జన జీవితాల్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆశిస్తూ… ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు” అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలతో పాటు పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లోని హిందువులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఆ దేశాల్లో అణచివేతకు గురవుతున్న హిందువుల కోసం అందరూ ప్రార్థించాలని కోరారు. భారత్, పాక్ విభజనకు సంబంధించిన బాధతో ఓ బాలుడు పాడిన పాటను షేర్ చేశారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ దేశాల్లోని హిందువులు ఆనందంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలు వస్తే.. తమను సంప్రదించాలని కోరారు.

“ఈ దీపావళి మీ ఇంట మరిన్ని వెలుగులు నింపాలని, మీకు మరిన్ని విజయాలు చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ దీపావళి శుభాకాంక్షలు” అంటూ వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆకాంక్షించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News