Sunday, October 20, 2024
Homeఆంధ్రప్రదేశ్Teluguprabha a common man's voice: సామాన్యుడి గొంతుకగా తెలుగుప్రభ

Teluguprabha a common man’s voice: సామాన్యుడి గొంతుకగా తెలుగుప్రభ

కీలక భేటీ

సామాన్యుడి గొంతుకగా తెలుగుప్రభ దినపత్రిక ఉందని ఆ సంస్థ సీఈవో బి. రమేష్ అన్నారు. ఆదివారం కర్నూలు పట్టణంలో ఏర్పాటు చేసిన రెండు జిల్లాల పాత్రికేయుల సమావేశంలో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరయ్యారు. తొలుత ఉమ్మడి జిల్లాల బ్యూరో చిరంజీవి ఆధ్వర్యంలో ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం పాత్రికేయులను పరిచయం చేసుకున్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన సంస్థ ఏ విధంగా అభివృద్ధి చెందాలో తెలిపారు. పత్రికారంగంలో తెలంగాణలో ఉన్నత స్థాయికి వెళ్లిన తెలుగు ప్రభను ఆంధ్రప్రదేశ్ లో కూడా విస్తరింప చేసినందుకు ఈ అభినందన సభను ఏర్పాటు చేశామన్నారు. నూతన ఒరవడితో ప్రధాన పత్రికలకు ధీటుగా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. సర్కులేషన్, యాడ్స్ లో రాజీ పడొద్దని ఆయన పాత్రికేయులకు సూచించారు. సమాజంలో జరుగుతున్న అసమానతలను చూపడంతో పాటు అన్ని పార్టీలకు సమానమైన గుర్తింపును ఇస్తున్నామన్నారు.

ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఈ పత్రికను విజయవంతంగా నడుపుతున్నందుకు ఇక్కడి వారిని ఆయన అభినందించారు. అనంతరం బ్యూరో ఇన్చార్జి చిరంజీవి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో చక్కని టీం ఉందని, తెలుగు ప్రభను ఉన్నత స్థాయికి తీసుకెళ్లడంలో వారి కృషి ఎంతో ఉందన్నారు. అనంతరం సీఈఓ రమేష్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో స్టాఫ్ రిపోర్టర్ ప్రసాద్ యాదవ్ మిగతా ప్రాంతాల నుంచి వచ్చిన పాత్రికేయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News