బండి ఆత్మకూరు మండలంలోని మండలపరిషత్ కార్యాలంలో యంపిడిఓ వాసుదేవ గుప్తా అధ్యక్షతన యంపిపి దేరెడ్డి చిన్న సంజీవరెడ్డి , మాజీ యంపిపి దేసు వెంకట రామిరెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని తెలుగు ప్రభ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం ఎంపీపీ మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాస్తూ, అతి స్వల్పకాలంలో నాయకులు, ప్రజలు మరియు అధికారుల మన్ననలతో ముందుకు కొనసాగుతుందని తెలియజేశారు.
- Advertisement -
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సింగిల్ విండో ప్రెసిడెంట్ భూరం శివలింగం, ఈఓఆర్డీ శ్రీనివాసులు, ఎఓ హనీఫ్ ఖాన్, కిరణ్, రామసుబ్బారెడ్డి, మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.