Highest Temperatures in AP: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా వేసవి ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. భానుడి భగభగలకి ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటివరకూ గరిష్ఠంగా 46 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు.. ఈ రోజు ఆ గరిష్ఠాన్ని కూడా దాటాయి. వేసవి తాపం దృష్ట్యా ప్రజలు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.
నెల్లూరు జిల్లా గూడూరులో అత్యధికంగా 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 46.1, మార్కాపురం జిల్లా కంభంలో 45.7, తిరుపతి జిల్లా బోనుపల్లెలో 45.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరోవైపు సోమవారం రాష్ట్రంలోని 27 మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

