Thursday, December 12, 2024
Homeఆంధ్రప్రదేశ్Tenth Exmas Schedule: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

Tenth Exmas Schedule: ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌(Tenth Exmas Schedule)ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్(Nara Lokesh) విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, 21న ఇంగ్లీషు, 24న మ్యాథ్య్స్, 26న ఫిజిక్స్, 28న బయోలజీ, 31న సోషల్ పరీక్షలు జరుగనున్నాయని పేర్కొన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

- Advertisement -

పదో తరగతి మార్కులు చాలా కీలకమని.. విద్యార్థులు చదివేందుకు వీలైనంత సమయం తీసుకొని మంచి మార్కులు సాధించాలని సూచించారు. విద్యార్థులు ఇప్పటి నుంచే ఒక టైమ్ టేబుల్ ఏర్పాటు చేసుకొని పరీక్షలకు సన్నద్ధం కావాలని.. పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలని సూచించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News