జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి చేయడంతో దేశవ్యాప్తంగా అన్ని పర్యాటక ప్రాంతాల్లో హై అలర్ట్ జారీ చేశారు. పర్యాటక ప్రాంతాలో పాటు ఆధ్యాత్మిక ప్రాంతాలకు ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారం నేపథ్యంలో అధికారు అలర్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, ముంబైతో పాటు మరికొన్ని కీలక ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. అలాగే ఆధ్యాత్మిక ప్రాంతాల్లో కూడా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
ఇందులో భాగంగా తిరుపతిలో(Tirupati) భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ క్రమంలో అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు తిరుమల ఘాట్ రోడ్లలోనూ అన్ని వాహనాల్లో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అలాగే తిరుమల కొండపై శ్రీవారి ఆలయ పరిసరాల్లో భద్రత సిబ్బంది అప్రమత్తమయ్యారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే విచారణ చేస్తున్నారు.