Homeఆంధ్రప్రదేశ్Thalliki Vandanam: గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఖాతాల్లోకి 'తల్లికి వందనం' నిధులు

Thalliki Vandanam: గుడ్‌న్యూస్‌.. నేటి నుంచి ఖాతాల్లోకి ‘తల్లికి వందనం’ నిధులు

Thalliki Vandanam: ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది. నేటి నుంచి రాబోయే నాలుగు రోజుల్లో తరగతుల వారీగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లోకి ఈ నిధులను ప్రభుత్వం విడుదల చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 67.47 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఆర్థిక సాయం వివరాలు: ‘తల్లికి వందనం’ పథకంలో భాగంగా 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు రూ. 15,000 చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ మొత్తంలో రూ. 13,000 నేరుగా తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి. మిగిలిన రూ. 2,000 పాఠశాల నిర్వహణ మరియు మౌలిక వసతుల కోసం కేటాయించనున్నారు.నాలుగు రోజుల పాటు దశలవారీగా డబ్బులు జమ కానుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read-YSRCP App : కార్యకర్తలకు ‘కొండంత’ రక్షణ కవచం.. ‘జగనన్న 2.0’ సూపర్ యాప్‌ను ఆవిష్కరించిన జగన్‌!

 

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News