Thursday, November 21, 2024
Homeఆంధ్రప్రదేశ్AP Assembly: అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

AP Assembly: అసెంబ్లీలో మూడు బిల్లులను ప్రవేశపెట్టిన ప్రభుత్వం

AP Assembly| ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. రెండో రోజు సమావేశాల్లో ప్రభుత్వం మూడు బిల్లులను ప్రవేశపెట్టింది. ఏపీ పంచాయతీరజ్ బిల్లు-2024, ఏపీ మున్సిపల్ బిల్లు-2024 బిల్లులను మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రవేశపెట్టారు. ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల బిల్లు-2024ను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లులకు శాసనసభ ఆమోదం తెలిపింది.

- Advertisement -

ఇక మరోవైపు శాసనమండలిలో బడ్జెట్‌పై వాడివేడి చర్చ జరిగింది. బడ్జెట్‌లో సూపర్ సిక్స్ పథకాల అమలుకు నిధులు కేటాయించలేదని వైసీపీ ఎమ్మెల్సీలు ఆరోపించారు. సూపర్ సిక్స్ పథకాల హామీలు ఇచ్చినప్పుడు అప్పులు ఉన్నాయని గుర్తుకు రాలేదా..? అని నిలదీశారు. దీంతో ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామిని నిలబెట్టుకుంటామని మంత్రులు స్పష్టం చేశారు. ఇక విజయగరం జిల్లా గుర్లలో డయేరియా బాధితుల విషయంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. దీంతో ప్రభుత్వ వైఖరికి నిరసనగా వైసీపీ ఎమ్మెల్సీలు మండలి నుంచి వాకౌట్ చేశారు. కాసేపు చర్చ అనంతరం మండలి రేపటికి వాయిదా పడింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News