Saturday, March 29, 2025
Homeఆంధ్రప్రదేశ్Weather: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

Weather: తెలుగు రాష్ట్రాల్లో మండిపోతున్న ఎండలు

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ ఉష్ణోగ్రతల ధాటికి ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉదయం తొమ్మిది దాటితే చాలు ఎండవేడిమికి బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంది. రెండు రాష్ట్రాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలతో జనం విలవిల్లాడుతున్నారు.

- Advertisement -

ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు..
ఏపీలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నేడు 108 మండలాల్లో తీవ్రవాడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. బుధవారం శ్రీకాకుళం జిల్లా -15, విజయనగరం జిల్లా-21, పార్వతీపురంమన్యం జిల్లా-10, అల్లూరి సీతారామరాజు జిల్లా-8, అనకాపల్లి-7, కాకినాడ-7, కోనసీమ-3, తూర్పుగోదావరి-13, ఏలూరు-5, కృష్ణా -2 ఎన్టీఆర్-6, గుంటూరు-3, పల్నాడు-8 మండలాల్లో వడగాల్పులు (108) ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది..

ఎండల తీవ్రత పెరుగుతున్న దృష్ట్యా బయటకు వచ్చే వారు జాగ్రత్తలు పాటించాలని సూచనలు చేసింది వాతావరణ శాఖ.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News