ఏపీలో శుక్రవారం తీవ్ర వడగాల్పులు, వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. వేసవి పూర్తిగా రాకముందే ఎండలు దంచికొట్టడంతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ఉత్తరాంధ్ర, అలాగే కోస్తా జిల్లాల్లో వేడి మొదలైంది. రాయలసీమ జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి దాదాపు ఉంది. ఆయా జిల్లాలో చాలా వరకు కూడా ఉష్ణోగ్రతలు క్రమక్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఇక నెమ్మదిగా వాతావరణం వేడెక్కుతుంది. ఈ వేసవి పూర్తిస్థాయిలో ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు చెప్తున్నారు.
ఇక ఈ ఏడాది ఎండలు చాలా ఎక్కువే ఉంటాయని సూచిస్తోంది. ముఖ్యంగా చాలా ప్రాంతాల్లో వేసవి తాపం ఎక్కువగా ఉంటుందని వివరించింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలు రాయలసీమ జిల్లాల్లో వడగాలి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తెలుపుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం నుంచి కొద్ది రోజులు పాటు వడగాలుపులు ఉండే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం, ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ వివరిస్తుంది.
వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు (84):
శ్రీకాకుళం జిల్లా 9, విజయనగరం 13, పార్వతీపురం మన్యం 11, అల్లూరి సీతారామరాజు 9, అనకాపల్లి 1, కాకినాడ 4, తూర్పుగోదావరి 8, పశ్చిమగోదావరి 1, ఏలూరు 8, కృష్ణా 7, గుంటూరు 8, బాపట్ల జిల్లాలోని 5 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుంది. అలాగే శనివారం కూడా 80 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
నిన్న నమోదైన ఉష్ణోగ్రతలు
గురువారం అనకాపల్లి జిల్లా నాతవరంలో 39.9°C, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 39.9°C, చిత్తూరు జిల్లా సింధురాజపురంలో 39.7°C, నంద్యాల జిల్లా బండి ఆత్మకూరులో 39.5°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. గురువారం 7 మండలాల్లో తీవ్ర, 68 మండలాల్లో వడగాల్పులు వీచాయని అన్నారు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
ఎండదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలి. వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె జబ్బులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
Weather: ఏపీలో దంచి కొడుతున్న ఎండలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES