Tirumala| హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం కనిపించింది. భక్తులు కానుకలు సమర్పించే హుండీలో నగదు చోరీ జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈనెల 26న ప్రధాన ఆలయంలోని స్టీల్ హుండీ నుంచి తమిళనాడుకు చెందిన వేణులింగం అనే భక్తుడు నగదు చోరీ చేసి పారిపోయాడు. టీటీడీ(TTD) విజిలెన్స్ సిబ్బంది సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా చోరీ జరిగినట్లు గుర్తించారు. అదే రోజు సాయంత్రం నిందితుడిని పట్టుకుని దొంగలించిన రూ.15వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుడిని అధికారులు పోలీసులకు అప్పగించారు.
మరోవైపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో విస్తృత ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. జనవరి 10 నుంచి 19వ తేదీ వరకూ పది రోజుల పాటు వైకుంఠం ద్వారా దర్శనానికి అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. వైకుంఠ ఏకాదశి పది రోజుల్లో ప్రోటోకాల్ విఐపీలు మినహా ఇతర వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.