Thursday, May 29, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala: తిరుమల వసతి గృహంలో చోరీ

Tirumala: తిరుమల వసతి గృహంలో చోరీ

తిరుమలలోని(Tirumala) వసతి గృహంలో చోరీ జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లికి చెందిన కుటుంబం శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు వచ్చారు. ఈ నేపథ్యంలో కొండపై విష్ణు నివాసంలోని రూమ్ నెంబర్ 613లో వసతి పొందారు. అనంతరం స్వామి వారి దర్శనానికి వెళ్లి వచ్చి గదిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సమయంలో 16 గ్రాముల బంగారం దొంగతనం జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News