ఏ తప్పూ చేయని మా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులు పెట్టి అక్రమ అరెస్టు చేయడం తుగ్లక్ పాలనకు నిదర్శనమంటూ టీడీపీ నేత తిక్కారెడ్డి నిప్పులుచెరిగారు. రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి ప్రజలు చెపుతారని ఆయన వైసీపీని హెచ్చరించారు. టీడీపీ మంత్రాలయం ఇన్ చార్జ్ పాలకుర్తి తిక్కారెడ్డి ..మేము సైతం అంటూ 15వ రోజు రీలే నిరహౕర దీక్షలో పాల్గొన్నారు. పెద్దకడూబురు మండలం క్లస్టర్ యూనిట్ బూతు ఇన్ చార్జ్ లు కూడా ఈ దీక్షలో పాల్గొన్నారు.. ఈ రీలే నిరహౕర దీక్షలో తిక్కారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుపై ఎన్ని కుట్రలు చేసిన ప్రజలు నిన్ను నమ్మరు జగన్, ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉన్నారని, కడిగిన ఆణిముత్యంలా చంద్రబాబు బయటికి వస్తాడు అని రానున్న రోజుల్లో తెలుగు దేశం పార్టీదే అధికారం అన్నారు…
ఈ రీలే నిరహౕర కార్యక్రమంలో పెద్దకడూబురు మండలం క్లస్టర్ ఇన్ చార్జ్ లు నరవ రమాకాంత్ రెడ్డి, బాబురావు, మండల కన్వీనర్ బసలదోడ్డి ఈరన్న, ఆర్ టి యస్ కన్వీనర్ దశరధిరాముడు, టౌన్ అధ్యక్షులు కురువ మల్లికార్జున, మీ సేవా ఆంజనేయులు, బోగ్గుల నరసన్న, తలారి అంజీ, నరసన్న, మహదేవ్,హనుమన్న, బెల్లమయ్య, ముని, పెద్దయ్య, మల్దకల్, యోహాను, యంకన్న, ముక్కరన్న, తోపాటు అన్ని గ్రామాలు నాయకులు కార్యకర్తలు దీక్ష లో కుర్చున్నారు.. దీక్ష కు టిడిపి రాష్ట్ర కార్యదర్శి పాలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, మంత్రాలయం మండలం కన్వీనర్ పన్నాగ వెంకటేశప్ప స్వామి, అశోక రెడ్డి, ఏసేబు, బిసి సెల్ అధ్యక్షులు మాధవరం అమర్నత్ రెడ్డి, బిసి సీనియర్ నాయకులు వక్రాని వెంకటేశ్వర్లు, సంఘీభావం తెలిపారు.