Homeఆంధ్రప్రదేశ్Thimmamapuram Highway Accident: తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి

Thimmamapuram Highway Accident: తుని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. అంబులెన్స్ ఢీకొని మహిళ మృతి

కాకినాడ అక్టోబర్ 2 (తెలుగు ప్రభ): తుని సమీపంలోని తిమ్మాపురం జాతీయ రహదారిపై శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మహిళలు ప్రయాణిస్తున్న ఆటోను అంబులెన్స్ ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

- Advertisement -

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన మహిళలు అన్నవరం సత్యదేవుడిని దర్శించుకున్నారు. అనంతరం తపులమ్మ లోవకు ఆటోలో వెళ్తుండగా.. తిరుపతి నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న అంబులెన్స్ తిమ్మాపురం జాతీయ రహదారిపై ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో స్వామివారి సేవకురాలిగా ఉన్న ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి గాయాలు కావడంతో వారిని తుని ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News