నాలుగేళ్ల వైసీపీ పాలనలో ప్రజా ప్రతినిధులుగా వైసిపి నాయకులుగా ప్రజల ముందు తల ఎత్తుకునేలా జన రంజకమైన సంక్షేమ పాలన కొనసాగిస్తున్న ఘనత సీఎం జగనన్నకే దక్కుతుందని ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ కొనియాడారు. పేద ప్రజలకు పక్క గృహాలు నిర్మించేందుకు ఇచ్చే స్థల కేటాయింపు పై టిడిపి నేత చంద్రబాబు నాయుడు అహంకార వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడం జరుగుతుందన్నారు. సోమవారం పట్టణంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పేద ప్రజలకు ఇస్తున్న జగనన్న పక్క గృహాల స్థలాల కేటాయింపు పై చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలను నిరసిస్తూ ఎమ్మెల్యే తో గూర్ ఆర్థర్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోనే స్థానిక రబ్బాని గోడౌన్ దగ్గర నుండి ఎమ్మెల్యే తోగూర్ అర్థర్ వందలాది వైసిపి కార్యకర్తలతో బైక్ ర్యాలీ పటేల్ సెంటర్ మీదుగా కొనసాగి కర్నూల్ రోడ్డు మార్గంలో వున్నా చామంతి ఫంక్షన్ హాల్ వరకు నిర్వహించారు. ఈ ర్యాలీలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, వైసిపి నాయకులు పెరుమాళ్ళ జాన్, వివిధ మండలాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం చామంతి ఫంక్షన్ హాల్ నందు ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే ఆర్థర్ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం జగనన్న అధికారం చేపట్టి నాలుగు సంవత్సరాలు పూర్తి కావస్తుందని నేడు ప్రజల మనసుల్లో వైసీపీ ప్రభుత్వం పై ఎలాంటి వ్యతిరేకత లేకుండా జన రంజకమైన సంక్షేమ పాలన కొనసాగించడంలో జగనన్నకు సాటి ఎవ్వరు లేరన్నారు. జగనన్న ప్రభుత్వానికి నేటికి తగ్గని ఆదరణ చూసి ఓర్వలేకే టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలపై పేద ప్రజలను కించపరిచేలా అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుర్దేశంలో భాగంగా మాత్రమేనన్నారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన ప్రజలకు వైయస్సార్ జగనన్న పక్క గృహాలు అందించి ఇల్లు లేని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చిన చరిస్మా కలిగిన ప్రజా నాయకుడు సీఎం జగన్ అన్నారు. నియోజవర్గంలోని అన్ని రకాల అభివృద్ధి పథకాలను ప్రజలకు అందించడం జరిగిందన్నారు. జగనన్న పాలన పై ప్రతిపక్ష పార్టీలకు విమర్శించడానికి అవకాశం లేదని రాజకీయ పబ్బం గడుపుకోవడానికి మాత్రమే పూటొక మాట మాట్లాడుతూ విమర్శలకు పూనుకుంటున్నారని అలాంటి వారికి వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన విధంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఎమ్మెల్యే ఆర్థర్ చేపట్టిన ర్యాలీ సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టణ ఎస్సై ఎన్వి రమణ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ సగినేలా హుసేన్నాయ్య, గృహ నిర్మాణ సంస్థ డైరెక్టర్ రమాదేవి, వైసీపీ మహిళ పట్టణ ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ, కొణిదల సర్పంచ్ కొంగర నవీన్,ఎస్సి సేల్ నంద్యాల జిల్లా అధ్యక్షులు వెంకటరమణ, వైసీపీ నాయకులు పైపాలెం ఈనాయాతుల్లా, ఆర్ట్ శీను రసూల్,వివిధ మండలాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Thogur: జగన్ ది జనరంజకమైన పాలన
సంబంధిత వార్తలు | RELATED ARTICLES