Thursday, September 19, 2024
Homeఆంధ్రప్రదేశ్Thoguru Arthur: చేసింది కొంత, చెప్పుకునేది కొండంత అదే బాబు నైజం

Thoguru Arthur: చేసింది కొంత, చెప్పుకునేది కొండంత అదే బాబు నైజం

జగనన్న సురక్ష ద్వారా 40,352 మందికి లబ్ధి

రైతన్నల కోసం, వ్యవసాయ రంగా అభివృద్దే ధ్యేయంగా నీటిపారుదల ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించి రైతన్నల సంక్షేమం కోసం పాటుపడిన, కృషి చేస్తున్న నాయకులు ప్రజానేత దివంగత నేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా ఆయన కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయంలో ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం విజయవంతం పై ఎమ్మెల్యే తో గురు ఆర్థర్ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే ఆర్తర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జగనన్న సురక్ష కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేసుకున్నామని పేర్కొన్నారు. 86 సచివాలయాల్లో జగనన్న సురక్ష కార్యక్రమాన్ని చేపట్టి 40,352 మంది లబ్ధిదారులైన ప్రజలకు ఉచితంగా వివిధ రకాలైన సర్టిఫికెట్లు అందించడం జరిగిందన్నారు. దీంతో ప్రజలు జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా ఉచిత సేవలు అందించడంతో ప్రభుత్వ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారన్నారు. అనంతరం టిడిపి నేత చంద్రబాబు నాయుడు నందికొట్కూరులో ముచ్చుమారి ఎత్తిపోతల ప్రాజెక్ట్ సందర్శపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు. నిర్మించింది దివంగత నేత వైఎస్ఆర్ అయితే నేనే నిర్మించాలని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చంద్రబాబు నాయుడు పరిపాలనలో వర్షాలు లేక కరువు కాటకాలతో ప్రజలు అల్లాడారని , ఆయన ఎక్కడ కాలు పెడితే అక్కడ వర్షాలు రావని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు. వ్యవసాయమే దండుగ అన్న నాయకుడు ప్రాజెక్టులు నిర్మించాను అనడం విడ్డూరంగా ఉంది అంటూ విమర్శించారు. ప్రాజెక్టుల సందర్శన పేరుతో వైయస్సార్ చేసిన అభివృద్ధిని, సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓ టూరిస్టుల సందర్శించి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ నేనే నిర్మించానని గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆయన పాలనలో కరువు కాటకలతో ప్రజల సంతోషంగా లేరని, నాడు దివంగత నేత వైయస్సార్, ఆయన కుమారుడు జగన్ పరిపాలనలో సకాలంలో వర్షాలు, పంటల సాగు కోసం వారు కృషి వల్ల నిర్మించిన ప్రాజెక్టుల ద్వారా సాగునీరు అందించడంతో ప్రజల సంతోషంగా ఉన్నారన్నారు. అదే చంద్రబాబుకు వైయస్సార్ కుటుంబానికి ఉన్న తేడా ప్రజలందరికీ తెలుసునన్నారు. తాను నిర్మించినటివి చేసిన పనులు చెప్పుకోవాలి తప్ప, ఇతరులు చేసిన కృషిని దోచుకోవాలనుకోవడం భావ్యం కాదని ఇతవు పలికారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మొల్ల రబ్బాని, సింగిల్ విండో చైర్మన్ సగినేలా హుసేన య్య, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ డైరెక్టర్ గంగిరెడ్డి రమాదేవి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ డైరెక్టర్ సుకుర్మీయ్య కౌన్సిలర్స్ జాకీర్ హుస్సేన్, ఉండవల్లి ధర్మారెడ్డి,వైసిపి పట్టణ మహిళా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వనజ, వైసిపి నాయకులు తమ్మడపల్లె విక్టర్, పేరుమల్ల జాన్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News