Saturday, November 23, 2024
Homeఆంధ్రప్రదేశ్Thota Chandrasekhar: ఏపీని విడగొట్టింది కేసీఆర్ కాదు...

Thota Chandrasekhar: ఏపీని విడగొట్టింది కేసీఆర్ కాదు…

ఏపీని విడగొట్టిన కేసీఆర్ పార్టీలో ఎందుకు జాయిన్ అయ్యారని తనను అందరూ అడుగుతున్నారంటూ ఆసక్తికరమైన విషయాలు చెప్పిన తోట చంద్రశేఖర్.. రాష్ట్రాన్ని విడగొట్టింది కేసీఆర్ కాదని, ఏపీని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ అంటూ వెల్లడించారు. కాంగ్రెస్ ఏపీని విడగొడితే బీజేపీ సహకరించింది, ycp, టీడీపీ లేఖలు ఇచ్చాయంటూ ఆయన గుర్తుచేశారు.

- Advertisement -

తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని కడుపు మండి కేసీఆర్ గొంతెత్తారంటూ తోట అన్నారు. ఆంధ్రా పాలకులు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తున్నారని కేసీఆర్ ప్రశ్నించారు, పోరాటం చేశారన్న ఆయన.. 9 ఏళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ఊహించని అభివృద్ధి జరిగిందన్నారు. 9ఏళ్ల క్రితం తెలంగాణలో కనీసం త్రాగునీరు లేదు..ఇప్పుడు కరువు రహిత రాష్ట్రంగా మారిందంటూ ఏపీ బీఅరెస్ శాఖ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ అన్నారు.

తెలంగాణ భవన్ లో ఆంద్రప్రదేశ్ నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి పలు చేరికలు సాగాయి. కర్నూల్, నంద్యాల, ప్రకాశం జిల్లాల నుంచి బీఆర్ఎస్ కండువా కప్పుకున్న పలువురు నాయకులు. కర్నూల్ కార్పొరేటర్ ముస్తాక్, సాయి తేజ్ సర్పంచ్, రామాపురం ప్రకాశం, సలీం బేగ్, వెంకటేశం, మాజీ ఎంపిటిసిలు, ZPTC మాజీ యూసుఫ్ బేగ్. MRPS కర్నూల్ జిల్లా అధ్యక్షురాలు రాధమ్మ, తదితరులు పార్టీలో చేరారు.
ఏపీలో అభివృద్ధి పక్కన పెట్టి కులాల కొట్లాట జరుగుతోందని, కేసీఆర్ పాలన కుల మతాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందన్నారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.
తెలంగాణ మోడల్ దేశానికి అవసరమని, ఏపీ లో రాజకీయ పార్టీల పరిస్థితి విచిత్రంగా ఉందన్నారు వేముల. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూడా మోడీకే మద్దతుగా ఉన్నాయని, విశాఖ ఫ్యాక్టరీని కేంద్రం అమ్మినా మోడీని అడిగే పరిస్థితి ఏపీలో లేదంటూ వేముల విమర్శించారు. ఏపీలో ప్రజల పక్షాన కొట్లాడే పార్టీ, కేసీఆర్ లాంటి నాయకుడు అవసరమని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News