విభజన హామీల సాధన భారత రాష్ట్ర సమితి పార్టీతోనే సాధ్యమౌతోందని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. హైదరాబాద్ లోని బి ఆర్ ఎస్ ఎపి క్యాంప్ కార్యాలయంలొ యర్రగొండపాలెం, ఆళ్లగడ్డ ప్రాంతాలకు చెందిన దూపాటి చంద్రబాబు, డాక్టర్ వెస్లీ సహా పలు జిల్లాలకు చెందిన నేతలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా తోట మాట్లాడుతూ ఉమ్మడి ఎపి విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో పూర్తిగా వెనకబడి పోయిందన్నారు. గత టిడిపి, ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాలు ఎపికి ప్రత్యేక హోదా, పోలవరం నిర్మాణం సహా విభజన హామీలు సాధనలో ఘోరంగా విఫలమయ్యాయన్ని దుయ్యబట్టారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వానికి ఈ రెండు పార్టీలు సాగిలపడి ఎపి ప్రయోజనాల్ని తాకట్టు పెట్టాయాన్ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ మెప్పు కోసం సీఎం జగన్, చంద్రబాబులిద్దరు వంగి వంగి దండాలు పెడుతూ వారి పబ్బం గడుపు కుంటున్నారని ఆరోపించారు. ఈ క్రమంలో దేశంలో బిజెపిని ఎదురించగల ఏకైక పార్టీ బి ఆర్ ఎస్ మాత్రమేనని స్పష్టం చేశారు. దేశ ప్రజలందరూ తెలంగాణ మోడల్ అభివృద్ధిని కాంక్షిస్తున్నారని చెప్పారు. టిడిపి వైసీపీ పార్టీలకు బి ఆర్ ఎస్ మాత్రమే ప్రత్యామ్నా యమన్నారు.రానున్న కాలంలో బి ఆర్ ఎస్ ఎపి రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెనాలి బాష తదితరులు పాల్గొన్నారు.
Thota Chandrasekhar: విభజన హామీలు బిఆర్ఎస్ తోనే సాధ్యం
వంగి దండాలు పెడుతూ పబ్బం గడుపుకుంటున్న ఏపీ నేతలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES