Homeఆంధ్రప్రదేశ్Tragedy: ఈత కొట్టేందుకు వెళ్లి.. వాగులో మునిగి ముగ్గురు మృతి

Tragedy: ఈత కొట్టేందుకు వెళ్లి.. వాగులో మునిగి ముగ్గురు మృతి

Tragedy in Alluri District: అల్లూరి జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుo కుంది. చేపలు పట్టేందుకు వెళ్లిన బాలురిలో ముగ్గురు నీట మునిగి మృత్యువాత పడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

- Advertisement -

Also Read: https://teluguprabha.net/career-news/telangana-inter-supplementary-exams-from-may-13th/

పెదబయలు మండలం పన్నెడ గ్రామానికి చెందిన ఐదుగురు బాలురు మత్స్యగెడ్డ వాగులో ఈత కొట్టేందుకు వెళ్లారు. వారిలో నలుగురు ప్రమాదవశాత్తు నీటిలో మునిగిపోయారు. మరొకరు బయటకు వచ్చి సహాయం కేకలు వేయగా.. గమనించిన మత్స్యకారులు వెంటనే అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే నలుగురూ మునిగిపోవడంతో వారిలో ఒకరిని మాత్రమే రక్షించగలిగారు. మిగిలిన ముగ్గురు చిన్నారులు వాగులో మునిగి మృతి చెందారు. 

Also Read: https://teluguprabha.net/cinema-news/cine-and-political-leaders-express-condolences-over-asha-bhosles-death/

మృతులను ప్రదీప్(11), పాంగి బబులు(10), హర్షిత్(12)గా గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బాలుర కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News