Homeఆంధ్రప్రదేశ్Rains in AP: ఏపీలో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షం..!

Rains in AP: ఏపీలో భిన్నమైన వాతావరణం.. ఓవైపు ఎండలు, మరోవైపు వర్షం..!

Thundershowers in AP: ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఓవైపు ఎండలు మండుతుండగా.. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తీవ్ర ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న జనాలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసరాలు, తూర్పుగోదావరి, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. అయితే, భారీ వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు-మెరుపుల సమయంలో చెట్ల కింద నిలబడకూడదని సూచించింది.

- Advertisement -

Also Read: Intermediate: ఇంటర్‌ మూల్యాంకనంలో ఘోర తప్పిదం.. 60 మార్కులు వస్తే 5 వేసిన లెక్చరర్!

ఆయా జిల్లాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రత..

ఇక, మరోవైపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఎండల ప్రభావం మరింత పెరుగుతోంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, కడప, నంద్యాల జిల్లాల్లో 42 నుంచి 44.5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్‌ ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు. మరో 34 మండలాల్లో సాధారణ వేడిగాలుల ప్రభావం ఉండొచ్చని తెలిపారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్నం బయటకు వెళ్లకూడదని, తగినంత నీరు తాగాలని సూచించారు. ఇదిలా ఉండగా, ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కొంత ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే రాష్ట్రాన్ని తాకే అవకాశం ఉందని తెలిపింది. సాధారణంగా జూన్ 1న కేరళ తీరాన్ని తాకే రుతుపవనాలు, ఈసారి మే 26 నాటికే ప్రవేశించే అవకాశముందని అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు క్రమంగా విస్తరించడంతో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశముంది.

వాతావరణ మార్పుపై ఏయూలో పరిశోధనలు..

అదేవిధంగా, విశాఖపట్నం నగరంలో అకస్మాత్తుగా వాతావరణ మార్పులపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ, ఐఐఐటీ కొట్టాయం పరిశోధకుల అధ్యయనాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు రెండూ క్రమంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. వర్షపాతం విషయంలో కూడా అనిశ్చిత పరిస్థితులు పెరుగుతున్నాయని పరిశోధనల్లో తేలింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News