HomeTop StoriesRain Alert: ఏపీ వాసులకు చల్లని కబురు.. రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం

Rain Alert: ఏపీ వాసులకు చల్లని కబురు.. రేపు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం

Rain Alert in AP Districts: ఉత్తర శ్రీలంక తీరం, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం నెలకొనడంతో రానున్న 48 గంటల్లో అది మరింత బలపడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని ప్రభావంతో మంగళవారం పలు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో తేలికపాటి వర్ష సూచన ఉందని తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఏలూరు, ఉభయ గోదావరి జిల్లాలు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, చిత్తూరు, జిల్లాల్లో వర్ష సూచన ఉందని పేర్కొంది. తిరుపతి, పోలవరం, అల్లూరి జిల్లాల్లో పలుచోట్ల వడగాలులు వీచే అవకాశముందని వివరించింది.

- Advertisement -

Also Read: https://teluguprabha.net/telangana/gadwal-vijayalakshmi-appointed-as-chairperson-of-telangana-womens-commission/

ఇదిలా ఉండగా.. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఎండ ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. భానుడి తాపంతో విజయవాడ, ఏలూరు జిల్లా కుక్కునూరు, పోలవరం జిల్లా కూనవరం ప్రాంతాల్లో 42 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు.. మంత్రాలయం, ప్రకాశం జిల్లా కొప్పెరపాడు, కడప, తాడేపల్లి ప్రాంతాల్లో 41 డిగ్రీల పైన ఉష్ణోగ్రత నమోదు కానున్నట్లు వెల్లడించింది. 

Also Read: https://teluguprabha.net/telangana/cm-revanth-about-pm-narendra-modi-and-owaisi/

పల్నాడు జిల్లా అచ్చంపేట, అనంతపురం జిల్లా రాయదుర్గం, కృష్ణా జిల్లా పెదపారుపూడి, నంద్యాల జిల్లా దోర్నిపాడు, మార్కాపురం జిల్లా నందనమారెళ్ల 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదుకానున్నట్లు వివరించింది. ప్రజలు ఎండల తీవ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News