Saturday, November 15, 2025
Homeఆంధ్రప్రదేశ్TTD: తిరుమలలో మహాపచారం.. టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం!

TTD: తిరుమలలో మహాపచారం.. టీటీడీ సిబ్బంది మాంసాహార భోజనం!

TTD Saff eat Non veg on Alipiri steps: పరమ పవిత్రమైన శ్రీ వారి పాదాల చెంత మహాపచారం చోటుచేసుకుంది. తిరుమలకు వెళ్లే అలిపిరి మెట్ల మార్గంలో టీటీడీ కాంట్రాక్ట్ సిబ్బంది మాంసాహార భోజనం చేస్తున్న ఫోటోలు సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. వాటిన చూసిన శ్రీ వారి భక్తులు తీవ్ర ఆగ్రహానికి లోనైయ్యారు.

- Advertisement -

ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు: కొంతమంది టీటీడీ కాంట్రాక్ట్ సిబ్బంది అలిపిరి మెట్ల మార్గంలో కూర్చొని మాంసాహారం తింటున్నారు. దీంతో అటుగా వెళ్తున్న భక్తులు స్వామి వారి చెంత మాంసాహారం తినొచ్చా అని వారిని ప్రశ్నించారు. అయితే చేసింది తప్పని ఒప్పుకోకుండా సదరు కాంట్రాక్ట్ సిబ్బంది భక్తుల పట్ల అగౌరవంగా మాట్లాడుతూ బెదిరింపులకు పాల్పడ్డారు. వారు మాంసాహారం తింటున్న వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది కాస్త వైరల్ అవుతోంది. అనంతరం జరిగిన ఘటనపై భక్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఈ విషయాన్ని టీటీడీ అధికారులకు తెలిపారు. దీంతో సదరు కాంట్రాక్ట్ సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad