Sunday, February 8, 2026
Homeఆంధ్రప్రదేశ్Tirumala: సంక్రాంతి సెలవులతో పోటెత్తిన తిరుమల కొండ.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Tirumala: సంక్రాంతి సెలవులతో పోటెత్తిన తిరుమల కొండ.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్!

Tirumala Rush Today: సంక్రాంతి పండుగ సెలవులు, వరుసగా వచ్చిన వారాంతపు సెలవుల నేపథ్యంలో కలియుగ వైకుంఠం తిరుమల భక్తులతో కిక్కిరిసిపోయింది. పండుగ అనంతరం శ్రీవారిని దర్శించుకోవాలనే సంకల్పంతో దేశవ్యాప్తంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో తిరుమల కొండపై ఎటు చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది.

- Advertisement -

అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ (TTD) అధికారులు భద్రతను , తనిఖీలను వేగవంతం చేశారు. శుక్రవారం సర్వదర్శనం కోసం టీటీడీ 10 వేల ఉచిత టోకెన్లను జారీ చేసింది. టోకెన్లు లేని భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లలో వేచి ఉన్నారు.

సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని కపిలతీర్థం పుష్కరిణి వద్ద తమ పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు నగరవాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. మరో వైపు తిరుమలలో ప్రస్తుతం చలి తీవ్రత విపరీతంగా ఉన్నప్పటికీ, గోవింద నామస్మరణతో భక్తులు చలిని సైతం లెక్కచేయకుండా క్యూ లైన్లలో వేచి ఉన్నారు.
రద్దీ దృష్ట్యా భక్తులకు తాగునీరు, అన్నప్రసాదాల పంపిణీలో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News