Saturday, March 29, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirumala: టీటీడీకి భారీగా విరాళాలు అందజేత

Tirumala: టీటీడీకి భారీగా విరాళాలు అందజేత

తిరుమల(Tirumala) శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు నిత్యం ప్రపంచ నలుమూలల నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. పలువురు భక్తులు అయితే టీటీడీ ట్రస్ట్‌లు అయిన ఎస్వీ అన్నదానం, ఎస్వీ ప్రాణదానం, ఎస్వీ విద్యాదానం విభాగాలకు భారీగా విరాళాలు అందజేయడం జరుగుతుంది.

- Advertisement -

గత తొమ్మిది రోజుల్లో టీటీడీ ట్రస్ట్‌లకు రూ.26.85కోట్లు విరాళంగా అందాయి. అత్యధికంగా శ్రీవారి ఆలయ నిర్మాణ ట్రస్ట్‌కు రూ.11.67కోట్లు, ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.6.14 కోట్లు, శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్‌కు రూ.4.88 కోట్లు అందాయి. తాజాగా రాజమహేంద్రవరానికి చెందిన తిరుమల విద్యాసంస్థల చైర్మన్ తిరుమలరావు దంపతులు టీటీడీ విద్యాదాన ట్రస్ట్‌కు రూ.1.01 కోట్లు విరాళం అందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News