Tirumala| తిరుపతిలో నివసించే స్థానికులకు ప్రతి మంగళవారం తిరుమల శ్రీవారి దర్శనం కల్పించాలని టీటీడీ బోర్డు(TTD Board) నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 3 నుంచి స్థానికులకు స్వామివారి దర్శనం కల్పించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఇందుకు సంబంధించి డిసెంబరు 2న తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో దర్శనం టోకెన్లు ఉచితంగా ఇవ్వనున్నారు. మహతి ఆడిటోరియంలో 2,500 టోకెన్లు, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్‌లో 500 టోకెన్లు తెల్లవారుజామున 3 నుంచి 5గంటల మధ్య అందించనున్నారు. టోకెన్లు కావాల్సిన భక్తుల కోసం కొన్ని మార్గదర్శకాలు జారీ చేశారు.
మార్గదర్శకాలు ఇవే..
** ముందుగా వచ్చిన వారికి తొలి ప్రాధాన్యత క్రమంలో టోకెన్లు కేటాయింపు
** దర్శనం టికెట్ పొందడానికి ఒరిజినల్ ఆధార్‌కార్డు తప్పనిసరి
** టోకెన్లు పొందిన భక్తులు దర్శన సమయంలో ఒరిజినల్ ఆధార్‌కార్డు తీసుకురావాలి
** వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని దివ్యదర్శనం క్యూలైన్‌లో భక్తులను దర్శనాలకు అనుమతిస్తారు
** దర్శనం అనంతరం ఒక లడ్డూ ఉచితంగా అందిస్తారు
** దర్శనం చేసుకున్న వారికి 90 రోజుల వరకు తిరిగి దర్శనం చేసుకునేందుకు అవకాశం ఉండదు