Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం

Tirupathi: విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన సీఎం

జగన్ సర్కారు విద్యా వ్యవస్థను సమూలంగా మార్చింది

మంచి విలువలు కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి మార్గంలో వారి భావి భవిష్యత్తుకు నాంది పలుకుతారని, విద్యా వ్యవస్థలో వినూత్నమైన మార్పులు తెచ్చి విద్యా వ్యవస్థ రూపు రేఖలు మార్చి విద్యకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద పీట వేశారని, సుమారు డెబ్భై వేల కోట్లు ఒక్క విద్యాభివృద్ధికే ఖర్చు పెట్టి, నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ప్రతి పిల్ల వాడిపై పెట్టే ప్రతి పైసా వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని విద్యను ప్రోత్సహిస్తున్నారని అన్నారు.

- Advertisement -

ఉదయం స్థానిక మహతి ఆడిటోరియంలో జరిగిన గురుపూజోత్సవ వేడుకల్లో రాష్ట్ర పర్యాటక, యువజన, సాంస్కృతిక, క్రీడా శాఖామాత్యులు శ్రీమతి ఆర్కే రోజా ముఖ్యఅతిథిగా పాల్గొనగా ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం, జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి గౌరవ అతిథులుగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన మరియు మాజీ రాష్ట్రపతి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పిం చి, వేంకటేశుని ప్రతిమకు పూజతో సభను ప్రారంభించి ప్రసంగించారు. 🌼 మంత్రి రోజా మాట్లాడుతూ ఎల్లవేళలా మనం ప్రతి రోజూ గురువులను స్మరించుకోవాలి అని అన్నారు. మాతృ దేవోభవ, పితృ దేవోభవ, ఆచార్య దేవోభవ అని ఉపాధ్యాయులకు దైవ స్వరూపులు గా మన సమాజంలో స్థానం ఉందని, పదవులను చూసి వారికి విలువ ఇచ్చే ఈ సమాజంలో కూడా, చదువు చెప్పిన గురువుకు ఎంతో ఉన్నతమైన స్థానం ఎప్పటికీ ఉంటుందని యువర్ బెస్ట్ టీచర్ ఈజ్ యువర్ లాస్ట్ మిస్టేక్ అని అన్నారు.

మంచి విలువలు కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థులకు మంచి మార్గంలో వారి భావి భవిష్యత్తుకు నాంది పలుకుతారని అన్నారు. విద్యార్థులు వారి జీవితంలో ఫలానా ఉపాధ్యాయులు మా జీవితాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చి దిద్దారు అని తెలిపినప్పుడు నిజమైన అవార్డు అందుకున్నట్లు అని అన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో వినూత్న రీతిలో వసతులు, సౌకర్యాలు, విద్యా బోధన చూసిన తర్వాత వాటిలో చేరిన పిల్లల సంఖ్య గణనీయంగా పెరిగింది అని అన్నారు. ప్రైవేటు విద్యా వ్యవస్థకు ధీటుగా బోధన వసతులు నాడు నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్నాయని, డిజిటల్ విద్య అందుబాటులోకి తెచ్చామని, మొన్నటి చంద్రయాన్ -3 వీక్షణ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో చూడగలుగుతున్నామంటే ఎంతో అడ్వాన్స్డ్ విద్యా బోధన వసతుల ఏర్పాటుతో ఇది సాధ్యం అయిందని తెలిపారు.

మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని, విద్యార్థులకు వారి విద్యా ఉన్నతికి జగనన్న అమ్మఒడి, విద్యా కానుక, వసతి దీవెన, విదేశీ విద్యా దీవెన, జగనన్న గోరుముద్ద తదితర పథకాలు అమలు చేస్తూ 70 వేల కోట్లు విద్యా శాఖ నుండి ఖర్చు పెట్టడడం జరిగిందనీ, విద్యపై పెట్టే ప్రతి పైసా వారి భవిష్యత్తుకు పెట్టుబడి అని నమ్మిన ముఖ్యమంత్రి పెద్ద ఎత్తున విద్యా వ్యవస్థలో నూతన ఒరవడి తెచ్చారు అని అన్నారు. గురువులు విలువలతో కూడిన విద్య అందించాలని అన్నారు. గతంలో ఆడ పిల్లలకు విద్య ఎందుకు అని చదివించే వారు కాదు అని, నేడు సిఎం ఆడపిల్లల విద్య వారి భవిష్యత్తులో వెలుగులు నింపుతుంది అని నమ్మి బాలికా విద్య ను ప్రోత్సహిస్తున్నారని, మహిళల అభ్యున్నతికి కట్టుబడి ఉన్నారని అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ తమ గురువులను మరిచిపోరాదని అన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గురుపూజోత్సవం నిర్వహించి ఉపాధ్యాయులను సన్మానించుకోవడం సంతోషంగా ఉందని ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు, విద్యార్థులకు శుభాశీస్సులు తెలిపారు. ముందుగా తనకు చదువు చెప్పిన గురువులను స్మరించుకుంటూ వారికి, తన తండ్రికి పాదాభివందనాలు అని తెలిపారు. సద్గురువులను గౌరవించుకుంటే సమాజాన్ని గౌరవించినట్టే అని అన్నారు. ఉపాధ్యాయుల గురించి ఎవరు మాట్లాడినా హృదయం నుండి వస్తాయి అని అన్నారు. ప్రధాన మంత్రి అయినా కూడా తన గురువును మరిచిపోలేరని అంతటి ఉన్నత స్థానం గురువుకి ఉందని అన్నారు. నేటి కాలంలో ఉపాధ్యాయులకు విలువ తగ్గిందనే మాటలో వాస్తవం లేదని, కానీ ఉపాధ్యాయులపై ఎంతో గురుతర బాధ్యత ఉందని దానిని కాపాడుకుంటూ, తప్పులు చేయకుండా సమ సమాజ నిర్మాణంలో ముఖ్య భూమిక పోషించాలని అన్నారు. విద్యలో విప్లవాత్మక మార్పులు తెచ్చి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నాడు- నేడు కార్యక్రమం అమలు ద్వారా పది రకాల వసతులు సౌకర్యాలు ఏర్పాటుతో ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలతో మంచి విద్యకు వాతావరణం ఏర్పాటైంది అని, జగనన్న అమ్మఒడి, బై లింగ్యూవల్ టెక్స్ట్ బుక్స్, ఇంగ్లీష్ మీడియం అమలు, బైజ్యుస్ కంటెంట్ తో కూడిన ట్యాబ్ లు అందించి విద్యలో కొత్త వొరవడితో అనేక సంస్కరణలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి తెచ్చారని తెలిపారు. నేటి విద్యా సదుపాయాలతో ప్రపంచంలో పోటీ పడే సామర్థ్యం మనం విద్యార్థులకు అందించగలమని తెలిపారు. దీపం తాను వెలుగుతున్న వరకే ఇంకో దీపాన్ని వెలిగించగలదు. అలాగే ఉపాధ్యాయులు వారి పరిజ్ఞానాన్ని నిరంతరం అప్డేట్ చేసుకుని కొత్త టెక్నాలజీ నేర్చుకుని ప్రపంచ పోటీ స్థాయికి చిన్నారులను తయారు చేసి, ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దడం లో తమ వంతు గురుతర బాధ్యత ను నిర్వర్తించాలని అన్నారు. ఎమెల్సి మాట్లాడుతూ గురువును మించిన దైవం లేదు అని, భగవంతుని మించిన స్వరూపం గురువు అని అన్నారు.ఎంతో ప్రాముఖ్యత కలిగిన గురువులకు డాక్టర్లకు ఎలా అయితే ప్రొటెక్షన్ యాక్ట్ లాంటిది ఉందో అలాంటి యాక్ట్ ఉండాలని తాను అభిప్రాయ పడుతున్నానని తెలిపారు. నిస్వార్థంతో విద్యార్థి ఉన్నతే తన సంతోషంగా భావించే మహోన్నత రూపం ఉపాధ్యాయులు అని తెలిపారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యకు ఎంతో ప్రాధ్యన్యత ఇస్తూ అనేక విద్యా సంస్కరణలు చేసి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొనియాడారు.

తమ గురువులను ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకుని వారికి వందనాలు తెలిపారు. అనంతరం తిరుపతి జిల్లాలో ఉత్తమ సేవలు అందించి పురస్కారాలు పొందిన 76 మంది ఉపాధ్యాయులకు మంత్రి, ఎమ్మెల్సీ కలెక్టర్ లు కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను సర్టిఫికేట్ ను అందచేసి అభినందనలు తెలిపారు. మంత్రి, గౌరవ అతిథులను ఉపాధ్యాయ శాఖ వారు సన్మానించారు. ఈ వేడుకల్లో పాఠశాలల చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులుగా జిల్లా విద్యాశాఖ అధికారి డా.వి.శేఖర్ నిర్వహించి వ్యవహరించగా, ప్లానింగ్ కోఆర్డినేటర్ ఎస్ ఎస్ ఎ రామచంద్ర రెడ్డి, ఎస్ ఎస్ ఎ సిబ్బంది, ఎంఈఓ లు అధ్యాపకులు ఉపాధ్యాయులు పలు కళాశాలల, పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News