Thursday, January 9, 2025
Homeఆంధ్రప్రదేశ్Tirupathi: అమరావతి నుండి తిరుపతికి హుటాహుటిన దేవాదాయ శాఖా మంత్రి ఆనం

Tirupathi: అమరావతి నుండి తిరుపతికి హుటాహుటిన దేవాదాయ శాఖా మంత్రి ఆనం

బాధ్యులపై చర్యలు

బాధితులకు సత్వర సహాయక చర్యలకు తక్షణ ఆదేశాలు జారీ చేసిన సిఎం చంద్రబాబు ఆదేశాలమేరకు స్వయంగా పర్యవేక్షణ కోసం దేవాదాయ శాఖా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తిరుపతి వచ్చారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో హుటాహుటిన తిరుపతికి వచ్చిన ఆయన దురదృష్టకరంగా జరిగినటువంటి తిరుపతి తొక్కిసలాట ఘటనలో మృతుల కుటుంబాల్ని స్వయంగా పరామర్శించే పనిలో ఉన్నారు.
చర్యల్లో విఫలమైన అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. పండుగ వేళ ఇలాంటి విషాదకర ఘటనలపై చింతిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. బాధితులకు సత్వర సహాయక చర్యలను స్వయంగా అందించేందుకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని బాధ్యతలు పర్యవేక్షించాల్సిందిగా ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం టీటీడీ పోలీసు అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్న మంత్రి ఆనం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News