AP Polycet results : పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్‌డేట్. పాలిసెట్-2026 ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ వేదికగా ఫలితాలను విడుదల చేయనున్నారు.
ఫలితాలను చూసుకోవడం ఎలా?: రాష్ట్ర వ్యాప్తంగా 1,77,581 మంది విద్యార్థులు పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం జరిగే పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 1,63,008 మంది హాజరయ్యారు. విద్యార్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ polycetap.ap.gov.in ద్వారా తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మన మిత్ర వాట్సప్ నంబరు 95523 00009 కు Hi మెసేజ్ చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ సాంకేతిక కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పాలిసెట్ ర్యాంకులే కీలకం కానున్నాయి. ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను అధికారులు ప్రకటించే అవకాశం ఉంది.
Also read-Sri Chaitanya: ఏపీ టెన్త్ ఫలితాల్లో శ్రీచైతన్య స్కూల్ ఆల్ టైం రికార్డు

