Toll Tax on AP Roads: ఏపీలో రానున్న రోజుల్లో రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇకపై జాతీయ రహదారులపైనే కాదు స్టేట్ హైవేస్‌పై కూడా టోల్ ట్యాక్స్ పడనుంది. రాష్ట్ర ప్రభుత్వం 1500 కిలోమీటర్ల స్టేట్ హైవేల అభివృద్ధికై ఆర్అండ్‌బీ ప్రతిపాదన ఆమోదిస్తే జరిగేది ఇదే. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల మేర రాష్ట్ర రహదారుల్ని అభివృద్ధి చేసేందుకు, పునర్నిర్మేందుకు సంకల్పించింది. హైబ్రిడ్ యాన్యువిటీ మోడ్ హ్యామ్ విధానంలో 19 ఏళ్ల వ్యవధిలో ఈ రోడ్ల నిర్మాణానికయ్యే ఖర్చును 22,826 కోట్లుగా అంచనా వేసింది. దీనికి సంబంధించి ఆర్అండ్‌బి ఓ ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో చర్చ జరిగింది.
ఆర్అండ్‌బి ప్రతిపాదనేంటి
రాష్ట్రంలోని 15 వందల కిలోమీటర్ల స్టేట్ హైవేలను మూడు దశల్లో మూడేళ్లలో నిర్మిస్తారు. మొదటి ఏడాది 600 కిలోమీటర్లు, రెండో ఏడాది 600 కిలోమీటర్లు, మూడో ఏడాది మరో 300 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగాల్సి ఉంటుంది. దీనికయ్యే ఖర్చులో 40 శాతం అంటే 4 వేల కోట్లను ఏపీ ప్రభుత్వం సమకూర్చనుంది. మిగిలిన 60 శాతం అంటే 7761 కోట్లను సదరు కాంట్రాక్ట్ సంస్థ భరిస్తుంది. ప్రభుత్వం భరించే ఖర్చులో భూ సేకరణ, పునరావాసం వంటి ఖర్చులుంటాయి. కాంట్రాక్టర్ భరించే ఖర్చును ప్రభుత్వం వడ్డీతో కలిపి 16 ఏళ్లలో చెల్లించనుంది. రహదారి పనులు పూర్తయ్యాక 16 ఏళ్ల పాటు టోల్ కూడా వసూలు చేసుకునేలా ఆర్‌అండ్‌బి ప్రతిపాదన సిద్దం చేసింది.
ప్రభుత్వం సమకూర్చే 4 వేల కోట్ల కోసం పలు సెస్‌ల ప్రతిపాదన AP State Highways Toll Tax
ప్రభుత్వం సమకూర్చాల్సిన 4 వేల కోట్ల నిధుల కోసం ఆర్‌అండ్‌బి కొన్ని ప్రతిపాదనలు చేసింది. రాష్ట్రంలోని ఆర్టీసీ స్థలాల్ని లీజుకు లేదా తనఖాకు పెట్టడం, పెట్రోల్-డీజిల్‌పై లీటరుకు రూపాయి రోడ్ సెస్ విధించడం ద్వారా ఏడాదికి 732 కోట్లు, గనులపై 10 శాతం ట్యాక్స్ ద్వారా ఏడాదికి 441 కోట్లు, వాహనాల రిజిస్ట్రేషన్ పై 10 శాతం ట్యాక్స్ ద్వారా ఏడాదిలో 350 కోట్లు వసూలవుతాయి. ఇక టోల్ Toll Tax on AP Roads ద్వారా సదరు కాంట్రాక్ట్ సంస్థకు ఏడాదికి 375 కోట్లు వస్తుందని ఆర్అండ్‌బి అంచనా వేస్తోంది.
వాస్తవానికి 1500 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికయ్యే ఖర్చు కేవలం 11,761 కోట్లు. అయితే వడ్డీతో సహా 19 ఏళ్ల పాటు అంచనా వేసిన ఖర్చు 22, 826 కోట్లు. అంటే అదనంగా 11 వేల కోట్లు కానుంది. అందుకే ఆర్అండ్‌బి చేసిన ప్రతిపాదనపై విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. ఓ వైపు కాంట్రాక్ట్ సంస్థకు టోల్ అప్పజెబుతూనే మరోవైపు రోడ్ సెస్‌లు విధించడం ఏ మేరకు సరైందనే విమర్శ వస్తోంది. గత ప్రభుత్వ హయాంలో కూడా కరోనా సమయంలో నిధుల కోసం పెట్రోల్- డీజిల్ ధరలపై రోడ్ సెస్ విధించాలనే ఆలోచన వచ్చినప్పుడు అప్పటి ప్రతిపక్షం తెలుగుదేశం నేతలు తీవ్రంగా విమర్శించారు. ఇప్పుడు అలాంటి ప్రతిపాదనే చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. అయితే ఆర్‌అండ్‌బి చేసిస ప్రతిపాదనకు AP Government New Toll On State Highways ఇంకా ప్రభుత్వం లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలపలేదు. ఒకవేళ ప్రభుత్వం ఆమోదిస్తే మాత్రం కచ్చితంగా ఏపీలో రోడ్డెక్కాలంటే భయపడే పరిస్థితి ఉంటుంది.

