నంద్యాల జిల్లాలో టమోటా కొనాలంటే వామ్మో అని బెంబేలెత్తుతున్నారు ప్రజలు. ప్రతి ఇంట్లో మూడు పూటలా వంట చేయాలంటే టమోటా వాడకం తప్పనిసరి. అయితే టమోటా ధరలు అమాంతం పెరగడంతో అమ్మో టమోటా… కొనేదెట్ట తినేదెట్లా అని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టమోటా పచ్చిమిర్చి ధరలతోపాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కూరగాయల ధరలు రోజురోజుకు పెరుగుతుండడంతో కొనలేం తినలేం అని మహిళలు వాపోతున్నారు. మండల కేంద్రమైన చాగలమర్రిలో ప్రతి రోజూ కూరగాయల మార్కెట్ జరుగుతుంది.
ప్రతి రోజు నిర్వహించే సంత మార్కెట్లో కిలో టమోటా ధర 200 రూపాయల నుండి 250 రూపాయలు పచ్చిమిర్చి ధర కిలో 100 రూపాయల నుండి 120 రూపాయల వరకు ఇతర కూరగాయలు 100 రూపాయల ధర పలుకుతుండడంతో వినియోగదారులు కూరగాయలను కొనుగోలు చేయలేక బెంబేలెత్తుతున్నారు. సంత మార్కెట్ కు సుమారు దాదాపుగా 10 గ్రామాల ప్రజలు కూరగాయలు కొనుగోలు చేసేందుకు రావడం జరుగుతుంది. దీంతో మార్కెట్ రోజు సొంత మార్కెట్ కళ కళలాడుతుంది. కూరగాయల ధరలు అమాంతం పెరగడంతో కొనుగోలు చేయడానికి కూడా మార్కెట్ కు ప్రజలెవరు రాకపోవడంతో సంత మార్కెట్ కలతప్పి వెలవెలబోయింది. గత వారము టమోటా రూ 150 ధర ఉండగా ఈవారం 200 పైగా చేరింది, 50 రూపాయలు ధర ఉన్న ఉన్న పచ్చిమిర్చి 100 రూపాయలకు పెరిగింది. ఈ వారము ధరలు విపరీతంగా పెరగడంతో వినియోగదారులు కొనలేని పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు అంతంతమాత్రంగానే పడడంతో రైతులు ఎక్కువ చోట్ల కూరగాయలు పండించకపోవడం దీంతో వ్యాపారస్తులు కూడా కూరగాయల ధరలను విపరీతంగా పెంచడం వలన కొనడానికి భారంగా మారిందని కూరగాయల ధరల భారం మోయలేక పోతున్నామని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి టమోటా ధరలను తగ్గించేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు.
Tomoto prices: అమ్మో.. టమోట..కొనలేం తినలేం
ఆకాశన్నంటుతున్న టమోటా… పచ్చిమిర్చి ధరలు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES