T20 World Cup: భారత జట్టు ప్రపంచకప్ గెలిచిన ఆనందంలో దేశమంతా సంబరాలు చేసుకుంటుంటే.. విజయవాడలో మాత్రం ఉద్రిక్తత చోటుచేసుకుంది. బెంజ్ సర్కిల్ వద్ద విజయోత్సవాలు జరుపుకుంటున్న క్రికెట్ అభిమానులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం తీవ్ర కలకలం రేపింది.టీమిండియా గెలుపుతో వేలాది మంది యువకులు అర్ధరాత్రి రోడ్లపైకి వచ్చి జాతీయ జెండాలతో కేరింతలు కొట్టారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా గుంపును చెదరగొట్టే క్రమంలో పోలీసులు విచక్షణారహితంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
యువకుడికి తీవ్ర గాయం: సీఐ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ లాఠీఛార్జ్‌లో ఓ యువకుడి తల పగిలి రక్తం ఓడింది. యూనిఫాంలో ఉన్నవారే కాకుండాసివిల్ డ్రెస్సులో ఉన్న పోలీసులు సైతం యువకులను కాళ్లతో తన్నుతూ అమానుషంగా ప్రవర్తించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also read-T20 World Cup: మిడిలార్డర్ వెన్నెముక తిలక్.. అంకితభావానికి నిదర్శనం సిరాజ్
జాతీయ జెండాతో ఉన్నా వదల్లేదు: వేడుకల్లో భాగంగా జాతీయ జెండా పట్టుకుని బస్సుపై నిల్చున్న ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయాన్ని ఎంజాయ్ చేస్తున్న తమపై ఇలాంటి దాడులు చేయడం ఏంటని యువత పోలీసుల తీరుపై మండిపడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ లాఠీఛార్జ్‌కు సంబంధించిన విజువల్స్ వైరల్ అవుతున్నాయి.

