Homeఆంధ్రప్రదేశ్Crime: కర్నూలు జిల్లాలో విషాదం.. పెళ్లికి వచ్చి నలుగురు మృతి

Crime: కర్నూలు జిల్లాలో విషాదం.. పెళ్లికి వచ్చి నలుగురు మృతి

Four Died in Kurnool District: కర్నూలు జిల్లాలో పండుగ పూట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల పెళ్లి కోసం వచ్చి తుంగభద్ర నదిలో స్నానానికి దిగి నలుగురు మృతి చెందారు. 

- Advertisement -

Also Read: https://teluguprabha.net/gallery/bhadrachalam-seetharamula-kalyanam-photos/

బంధువుల ఇంట్లో శుభకార్యానికి వచ్చి విగతజీవులుగా మారిన దుర్ఘటన కర్నూలు జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది. కోసిగి మండలం పరిధిలోని ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు ఉన్నారు. మృతులంతా కర్ణాటకలోని రాయచూరు జిల్లా మాన్వి తాలూకా కురిడి గ్రామానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.

జిల్లాలోని కందుకూరు గ్రామంలో బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరయ్యేందుకు వీరు రెండు రోజుల క్రితం వచ్చారు. పెళ్లి ముగిసిన తర్వాత, సరదాగా గడిపేందుకు సుమారు 15 మంది బృందంగా ఆర్డీఎస్‌ ఆనకట్ట వద్దకు వెళ్లారు.

Also Read: https://teluguprabha.net/cinema-news/chiranjeevi-shared-ram-charan-performs-homam-at-his-home/

నదిలో స్నానం చేస్తూ సెల్ఫీలు తీసుకునే ప్రయత్నంలో ఒకరి తర్వాత ఒకరు నీటిలో మునిగిపోయారు. ఈత రాకపోవడం వల్ల నలుగురు మృతి చెందారు. తోటి బంధువులు సమాచారం అందించడంతో పోలీసులు, స్థానికులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్ల సాయంతో మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనతో పెళ్లింటితో పాటు మృతుల స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News