Tragic Incident| తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల వాగులు, వంకలు కొట్టుకుపోతున్నాయి. మరికొన్ని చోట్లు కొండచరియలు కూడా విరిగిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనంతపురం జిల్లా(Anantapur District)లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
వర్షాల ధాటికి జిల్లాలోని కుందుర్పి మండలం రుద్రంపల్లిలో పాత మట్టి మిద్దె(Old Mud House) అకస్మాత్తుగా కూలిపోయింది. కూలిపోయిన సమయంలో కుటుంబంలోకి ముగ్గురు వ్యక్తులు ఇంట్లోనే నిద్రిస్తున్నారు. మిద్దె వారిపై పడటంతో ముగ్గురు స్పాట్‌లోనే మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన గంగన్న, శ్రీదేవి, సంధ్యగా స్థానికులు చెబుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం స్థానికుల సహాయంతో మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. భారీ వర్షాలు పడే సమయంలో పాత కాలం నాటి ఇళ్లల్లో ఉండొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.