రాజంపేట సబ్ జైల్ నుంచి నరసరావుపేటకు సినీ నటుడు పోసాని మురళి కృష్ణను తరలిస్తున్నారు. పోసాని కృష్ణ మురళిపై నరసరావుపేట టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. ఇప్పటికే నాలుగు రోజులుగా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా పోసాని ఉన్నారు. పిటి వారెంట్ పై పోసానిని నరసరావుపేటకు తరలిస్తున్నట్లు టూ టౌన్ సీఐ హేమారావు తెలిపారు.
- Advertisement -

కాగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ పోసానిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అనంతరం కోర్టు ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ విధించడంతో రాజంపేట సబ్ జైలుకు తరలించారు. ఇప్పుడు రాజంపేట సబ్ జైల్ నుంచి నరసరావుపేటకు సినీ నటుడు పోసాని మురళి కృష్ణను తరలిస్తున్నారు.