Saturday, November 30, 2024
Homeఆంధ్రప్రదేశ్తిరుమల తిరుపతి స్థానికులకు అలర్ట్.. TTD కీలక ప్రకటన

తిరుమల తిరుపతి స్థానికులకు అలర్ట్.. TTD కీలక ప్రకటన

టిటిడి (TTD) ధర్మకర్తల మండలి నవంబర్ 18న జరిగిన తొలి సమావేశంలో ప్రతి నెలా మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిసెంబర్ 3న (మొదటి మంగళవారం) స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది.

- Advertisement -

అందులో భాగంగా ముందుగా డిసెంబర్ 1న ఆదివారం తిరుపతి మహతి ఆడిటోరియంలో, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ నందు ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఉదయం 5 గంటలకు టోకెన్లును జారీ చేయనున్నట్లు ప్రకటించినా, నిరంతరాయ వర్షాల కారణంగా ఈ తేదీని డిసెంబర్ 2 కు మార్పు చేస్తున్నట్లు టిటిడి (TTD) ప్రకటించింది. ఈ మేరకు తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట మండలాలతో పాటు తిరుమలకు చెందిన స్థానికులు తమ ఆధార్ ఒరిజినల్ కార్డును చూపించి సదరు కేంద్రాలలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో టోకెన్లు పొందవచ్చని తెలియజేయడమైనది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News